నాగచైతన్య హీరోగా రూపొందిన మోస్ట్ అవైటెడ్ ఫిక్షన్ డ్రామా వృషకర్మ. అతీంద్రియ శక్తుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకుడు. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా మీట్లో నాగచైతన్య మాట్లాడారు. వృషకర్మ ఓ డిఫరెంట్ అటెంప్ట్. మా కంఫర్ట్ జోనర్ నుంచి బయటకొచ్చి, ఎప్పుడూ చూడని కొత్త ఎక్స్పీరియన్స్ ఆడియన్స్‌కి ఇవ్వాలనే ప్రయత్నంతో కష్టపడి చేసిన సినిమా ఇది. కథనీ, డైరెక్టర్ కార్తీక్ విజన్నీ నమ్మి ఈ సినిమా చేశా. షూటింగ్ మొదలయ్యాక ఒక దశలో వృషకర్మ ప్రపంచంలోకి వెళ్లిపోయాను. తను ఏం చెబితే అది చేశాను. సినిమా అవుట్‌పుట్ చూశాక చెప్పలేనంత ఆనందం కలిగింది. ఒక లార్జర్ స్కేల్ సినిమా చేయాలనే నా కోరిక వృషకర్మతో తీరింది. డిసెంబర్ 4న వస్తున్నాం. ట్రైలర్‌ని మించి సినిమా ఉంటుంది అని అన్నారు.

ఇది ఓ రకమైన హారర్ సినిమా. గొప్ప థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది వెండితెరపైనే చూడాలి. అంచనాలకు మించి, తెలుగు సినిమా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది అని దర్శకుడు కార్తీక్ దండు తెలిపారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల కథానాయిక మీనాక్షి చౌదరి ఆనందం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, స్పర్శ్ శ్రీవాస్తవ్, ప్రొడక్షన్ డిజైనర్ శ్రీనాగేంద్రకుమార్, డీవోపీ రాగుల్ డి.హెరియన్ కూడా మాట్లాడారు.















