ప్రియా హెగ్డే, చిరాగ్ జానీ, మాన్య గౌడ, మహేశ్ విట్టా, టెంపర్ వంశీ, సాహితీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మిసెస్ కల్నల్. శ్రీకరం ప్రభాకర్ దర్శకుడు. సాయికృష్ణ నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉన్నది. ఈ సినిమా టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. అన్ని వర్గాలకూ నచ్చే విభిన్నమైన అంశాలు ఈ సినిమాలో ఉంటాయని దర్శకుడు శ్రీకరం ప్రభాకర్ చెప్పారు.

ఈ సినిమాలో భాగం కావడం పట్ల నటీనటులందరూ ఆనందం వెలిబుచ్చారు. సినిమా బాగా వచ్చిందని, నిర్మాతగా ఓ మంచి సినిమా నిర్మించానన్న సంతృప్తిని ఈ సినిమా ఇచ్చిందని నిర్మాత సాయికృష్ణ తెలిపారు. హీరో చిరాగ్ జానీ మాట్లాడుతూ.. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరోగా నటించడం తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని, అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలని పేర్కొన్నారు.ఇంకా ఎడిటర్ కార్తికేయన్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: కార్తిక్ కొప్పెర, సంగీతం: సునీల్ కశ్యప్, సమర్పణ: విలోక్, కౌశిక్, నిర్మాణం: ఆది క్రియేషన్స్.















