Namaste NRI

జియో కస్టమర్లకు శుభవార్త.. రూపాయికే

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇటీవలే జియో టారిఫ్‌ లను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. అయితే,  తాజాగా తన కస్టమర్లకు స్వల్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. 100 ఎంబీ డేటాను 1 రూపాయికి అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. జియో 1 జీబీ డేటాను రూ.15కి అందిస్తోంది. అయితే తాజా రూపాయికే 100 ఎంబీ డేటాను అందిస్తున్నట్లు పేర్కొంది. అంటే 1 జీబీ డేటా 100 రూపాయలకు వస్తుందన్నమాట. అంతేకాదు 28 రోజుల వాలిడిటీని 30 రోజులకు పెంచుతున్నట్టు జియో ప్రకటించింది. జియో తీసుకున్న తాజా నిర్ణయం ఇతర టెలికాం కంపెనీలకు షాక్‌ ఇచ్చింది.

                మరోవైపు జియో యూజర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.  జియో కంపెనీ తీసుకుంటున్న నిర్ణయాలు టెలీకాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలుకుతున్నాయని చెప్పవచ్చు. జియో కొత్త ప్లాన్‌ పై ఇతర టెలీకాం కంపెనీలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events