Skip to main content

Namaste NRI

కొత్త చట్టాన్ని తెచ్చిన మయన్మార్‌ .. వారికి మరణ శిక్ష

సైబర్‌ మోసాల నేరాలకు మయన్మార్‌లో ఇకపై మరణ శిక్ష విధించనున్నారు. సైనిక మద్దతు గల మయన్మార్‌ ప్రభుత్వం ఈ మేరకు పార్లమెంట్‌లో ఒక చట్టాన్ని ఆమోదించింది. ఆన్‌లైన్‌ మోసాల కేంద్రాల్లో పనిచేసేలా బాధితులను నిర్బంధించే, లేదా హింసాత్మకంగా బలవంతం చేసే వారికి మరణ శిక్ష విధించడానికి ఇది అనుమతిస్తుందని స్పీకర్‌ ఆంగ్‌ లిన్‌ ద్వే తెలిపారు.

ఈ కొత్త చట్టం ప్రకారం ఆన్‌లైన్‌ మోస కేంద్రాన్ని నిర్వహించే వారికి, క్రిప్టో కరెన్సీ మోసాలు చేసే వారికి 10 ఏండ్ల జైలు శిక్షను విధిస్తారు. కాగా, ఆన్‌లైన్‌ మోస కేంద్రాలకు మయన్మార్‌ పెట్టింది పేరు. ఇక్కడ కొన్ని ముఠాలు భారత్‌ సహా పలు దేశాల యువకులకు విదేశీ ఉద్యోగాల పేరుతో ఎరవేసి రప్పించి ఆన్‌లైన్‌ నేరాలు చేయిస్తున్నాయి.

Social Share Spread Message

Latest News