Skip to main content

Namaste NRI

భారత విద్యార్థులకు థన్‌బర్గ్ ఎందుకు మద్దతు పలికారు?

విద్యావ్యవస్థలో అవకతవకలకు వ్యతిరేకంగా భారతదేశంలో జరిగిన విద్యార్థి ఆందోళనలకు మద్దతుగా పర్యావరణ ఉద్యమకారిణి గ్రెటా థన్‌బెర్గ్‌ లండన్‌లో గళమెత్తారు. యువత శక్తికి నిజమైన అర్థం ఏమిటో భారతీయ విద్యార్థులు నిరూపించారని ఆమె ప్రశంసించారు. స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా యూకే ఆధ్వర్యంలో లండన్‌లో నిర్వహించిన ఒక సమావేశంలో గ్రెటా థన్‌బెర్గ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతీయ విద్యార్థుల ఆందోళన మనందరికీ గర్వకారణమని, వారు మనలో నూతనోత్సాహాన్ని నింపారని ఆమె అన్నారు. ప్రజలందరూ ఏకమై నిలబడితే ఎలాంటి విజయాలు సాధించవచ్చో ఈ ఉద్యమం ద్వారా నిరూపితమయ్యిందని తెలిపారు.

Social Share Spread Message

Latest News