Skip to main content

Namaste NRI

రవితేజ ఇరుముడి సినిమా విడుదల ఎప్పుడుంటే?

రవితేజ తాజా చిత్రం ఇరుముడి విడుదల తేదీ విషయంలో ఎలాంటి అయోమయం లేదని, ముందుగా ప్రకటించినట్లుగా ఆగస్ట్‌ 21న ప్రేక్షకుల ముందుకొస్తున్నదని మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఆధ్యాత్మిక అంశాల కలబోతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌గ్లింప్స్‌తో పాటు ఇరుముడి కట్టు అనే అయ్యప్పభక్తి పాటకు అద్భుతమైన స్పందన లభిస్తున్నదని చిత్రబృందం వెల్లడించింది. త్వరలో ఈ సినిమాలోని రెండోపాటను రిలీజ్‌ చేస్తామని చిత్ర దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు. ప్రియాభవానీశంకర్‌, సాయికుమార్‌, బేబీ నక్షత్ర తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్‌కుమార్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శివ నిర్వాణ.

Social Share Spread Message

Latest News