Skip to main content

Namaste NRI

అనకాపల్లి ట్రైలర్ ను విడుదల చేసిన టాలీవుడ్ థండర్స్ టీం

విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్యా వశిష్ట, తారక్‌ పొన్నప్ప ప్రధాన పాత్రలు పోషిస్తున్న రా అండ్‌ రస్టిక్‌ చిత్రం అనకాపల్లి. ఖగేష్‌ తమ్మినేని దర్శకుడు. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మాతలు. దర్శక, నిర్మాత త్రినాథరావు నక్కిన ఇందులో ఓ ముఖ్య పాత్ర కూడా పోషిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.
విశాఖపట్నంలో జరిగిన ఎలైట్‌ క్రికెట్‌ లీగ్‌ సీజన్‌ 2లో టాలీవుడ్‌ థండర్స్‌ టీంతో కలిసి, వేలాదిమంది సమక్షంలో మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో నటులు శ్రీకాంత్‌, తరుణ్‌, సుధీర్‌బాబు, అశ్విన్‌బాబు, సంగీత దర్శకుడు తమన్‌ తదితరులంతా పాల్గొన్నారు. హీరోహీరోయిన్ల లవ్‌ ట్రాక్‌, తారక్‌ పొన్నప్ప విలనీ, యాక్షన్‌ సీక్వెన్స్‌ ఈ ట్రైలర్‌లో హైలైట్స్‌గా చెప్పొచ్చు. ఆగస్ట్‌ 7న సినిమా విడుదల కానున్నది.ఈ చిత్రానికి కెమెరా: మాయా.వి, సంగీతం: దేవ్‌జండ్‌, నిర్మా ణం: భవ్యశ్రీ మూవీ మేకర్స్‌, నక్కిన నెరేటివ్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events