Skip to main content

Namaste NRI

దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార.. ఫస్ట్ సింగిల్ రిలీజ్

దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్న తాజా చిత్రం ఆకాశంలో ఒక తార. శ్రుతిహాసన్‌, సాత్విక వీరవల్లి కథానాయికలు. పవన్‌ సాదినేని దర్శకుడు. సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలు. దుల్కర్‌ సల్మాన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తొలిపాటను మేకర్స్‌ విడుదల చేశారు. చిట్టి చిట్టి చీమ.. చిట్టి చేతుల్తో అయ్యో రామా.. వంద టన్నుల చెక్కెర మోస్తుందమ్మా అంటూ సాగే ఈ పాటను శ్రీమణి రాయగా, జీవీ ప్రకాశ్‌కుమార్‌ స్వరపరిచారు. రమ్య బెహరా ఆలపించారు. కథలోని సారాంశాన్ని ఈ పాట సాహిత్యంలో మిళితం చేసి రాసినట్టుగా హీరోయిన్‌ కోణంలో ఈపాట సాగింది. నక్షత్రాలను తాకాలని కలలు కనే ఓ అమ్మాయి కలను, ఆమె పక్కనే నిలబడి నిశ్శబ్దంగా అండగా నిలిచే అబ్బాయి ప్రేమను ఈ పాట ప్రతిబింబిస్తున్నది. సంప్రదాయ ప్రేమకథలకు భిన్నంగా, ఒక ప్రత్యేకమైన బంధాలను ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events