Namaste NRI

అమెరికాకు.. ఇజ్రాయెల్ షాక్!

ఒమిక్రాన్‌ వైరస్‌ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి.  తమ పౌరులు అమెరికాకు వెళ్లడాన్ని నిషేధించాలని ఇజ్రాయెల్‌ నిర్ణయించింది. ఈ మేరకు ఆ దేశ ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. దీనిపై ప్రధాని నఫ్తాలి బెన్నెట్‌ సానుకూల నిర్ణయం తీసుకుంటారని అధికార వర్గాలు తెలిపాయి. అగ్రరాజ్యాన్ని రెడ్‌ లిస్ట్‌లో పెట్టాలని సూచించింది. ఒమిక్రాన్‌ వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం ఐదో వేవ్‌ ముంగిట ఉందని బెన్నెట్‌ వెల్లడిరచారు. మరోసారి లాక్‌డౌన్‌ విధించకుండా ఉండాలనే ట్రావెల్‌ బ్యాన్‌ విధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే యూరోపియన్‌ దేశాలు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాయని, అందువల్ల తాము కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి అవసరం ఉందని చెప్పారు.  ఇజ్రాయెల్‌లోని 9.3 మిలియన్ల జనాబాలో ఇప్పటికే 4.1 మిలియన్ల మంది కరోనా వ్యాక్సిన్‌ మూడు డోసులు తీసుకున్నారు.  దేశంలో ప్రస్తుతం 5 నుంచి 11 ఏండ్ల చిన్నారులకు టీకా వేస్తున్నారు.  బ్రిటన్‌తో పాటు డెన్మార్క్‌, ఆఫ్రికాలోని చాలా దేశాలను ఇజ్రాయెల్‌ రెడ్‌ లిస్ట్‌లో పెట్టింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events