Skip to main content

Namaste NRI

విదేశాల నుంచి వచ్చే వారికి.. భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు తిరిగి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. విదేశాల నుంచి వచ్చే ప్రమాణికులను ఉద్దేశించి భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ముందుగానే ఆన్‌లైన్‌ ద్వారా ఆర్టీపీసీఆర్‌ టెస్టు కోసం ఎయిర్‌ సువిధా పోర్టల్‌లో తప్పనిసరిగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇకపై ఇండియాకు వచ్చే ముందే ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌ కోసం ఎయిర్‌ సువిధా పోర్టల్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. గత 14 రోజుల ట్రావెల్‌ హిస్టరీలో ఎట్‌ రిస్క్‌ దేశాల్లో పర్యటించినట్లు ఉన్నట్లైతే  సదరు ప్రయాణికులకు కూడా ఆ దేశాలు వర్తించనున్నాయి.

Social Share Spread Message

Latest News