Skip to main content

Namaste NRI

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సర్ ప్రైజ్.. ఇదే తొలిసారి!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన సతీమణి జిల్‌ బైడెన్‌ క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా వాషింగ్టన్‌లోని చిల్డ్రన్స్‌ నేషనల్‌ ఆస్పత్రిని సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులకు సర్‌ఫ్రైజ్‌ చేశారు. అధ్యక్షుడు స్వయంగా ఆస్పత్రిని సందర్శించడం ఇదే తొలిసారని తెలిసింది. ఆస్పత్రిలోని పిల్లలకు బహుమతులు అందించిన బైడెన్‌ దంపతులు ఓలాఫ్‌ నైట్‌ బిఫోర్‌ క్రిస్మస్‌ కథను కూడా చదివి వినిపించారు. క్రిస్మస్‌ రోజున అధ్యక్షుడిని స్వయంగా కలుసుకున్నందుకు చిన్నారులు  ఉబ్చితబ్బిబ్బయ్యారు. వాస్తవానికి ఈ కార్యక్రమం ప్రతి ఏటా జరిగేదే అయినప్పటికీ సాధారణంగా అధ్యక్షుల భార్యలే ఆస్పత్రిని సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్వయంగా ఆస్పత్రిని సందర్శించి ఓ కొత్త ఒరవడికి నాంది పలికారు. 

Social Share Spread Message

Latest News