Skip to main content

Namaste NRI

ప్రపంచానికి మరో ముప్పు

కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎప్పటికప్పుడు రూపం మార్చుకుని విరుచుకుపడుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌ చాలా వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పుడు దాని కంటే మరింత వేగంగా వ్యాపించే కొత్త వేరియంట్‌ బయటపడిరది. యూరప్‌ దేశమైన ఫ్రాన్స్‌లో ఈ కొత్త వేరియంట్‌ కేసులు నమోదైనప్పటికీ వారంతా ఆఫ్రికన్‌ దేశమైన కామెరూన్‌ నుంచి రావడం ఇప్పుడు కలవరపెడుతున్నది. ఫ్రాన్స్‌లోని మార్సెల్లెస్‌లోని ఐహెచ్‌యూ మెడిటెర్రన్‌ ఇన్ఫెక్షన్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు దీన్ని గుర్తించారు. బీ.1.640.2 వేరియంట్‌ అయిన దీన్ని ఐహెచ్‌యూ రకంగా పిలుస్తున్నారు. దక్షిణ ఫ్రాన్స్‌లో ఇప్పటి వరకూ కనీసం 12 మందిలో ఇది బయటపడినట్లు  పరిశోధకులు తెలిపారు.  అయితే ఆ వేరియంట్‌ ప్రభావం, టీకాల ద్వారా రక్షణ తదితర అంశాలపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమని చెప్పారు. ఒమిక్రాన్‌ కన్నా ఈ వేరియంట్‌లోనే ఉత్పతివర్తనల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ప్రస్తుత టీకాలు దీన్ని అడ్డుకోగలవా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.

Social Share Spread Message

Latest News