సౌదీ ప్రభుత్వం మహిళలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ దేశంలోని మహిళలు కార్లు నడపడం, రేసింగ్లలో దూసుకుపోవడమే కాదు త్వరలో హైస్పీడ్ రైలును పరుగులు పెట్టించనున్నారు. హరమైన్ ఎక్స్ప్రెస్ రైలులో పైలట్లుగా విధులు నిర్వహించేందుకు శిక్షణ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సౌదీ మహిళలను ఆ దేశ రైల్వే పాలిటెక్నిక్ (ఎస్ఆర్పీ) కోరింది. ఇది మహిళలకు సరికొత్త స్థాయికి తీసుకెళ్తుందని పేర్కొంది. గంటకు 300 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించే హరమైన్ హైస్పీడ్ రైలు 2018లో పట్టాలెక్కింది.














