Skip to main content

Namaste NRI

బ్రిటన్ లో విజృంభిస్తున్న కరోనా

బ్రిటన్‌లో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దేశంలో ఒకేరోజు రెండు లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వెలుగుచూసినప్పటి నుంచి బ్రిటన్‌లో ఒకే రోజు ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో 2,18,724 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా 48 మంది మరణించడటంతో మొత్తం మృతులు 1,48,941కి పెరిగారు. అదేవిధంగా 14,126 మంది బాధితులు ఇంకా దవాఖానలో చికిత్స పొందుతున్నారు. కాగా, భారీగా రోజువారీ కేసులు నమోదవుతున్నప్పటికీ దేశంలో ఇప్పటికిప్పుడే ఆంక్షలు విధించే ఉద్దేశమేదీ లేదని బ్రిటిష్‌ హెల్త్‌ సెక్రెటరీ వెల్లడిరచారు. దేశంలో ఇప్పటివరకు 12 ఏండ్ల వయస్సు పైబడినవారిలో 90 శాతానికి పైగా మంది కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నారు. అదేవిధంగా సుమారు 82 శాతం మంది రెండు డోసులు వేయించుకున్నారు.

Social Share Spread Message

Latest News