వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వారికి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేస్తుంది. ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి వీలు కలుగుతుంది. యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాదారులకు నిజంగా ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి డ్రైవింగ్ క్లాసుల్లేకుండా గోల్డెన్ వీసాదారులు దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందే చక్కటి అవకాశవం. ఈ మేరకు రోడ్స్ అండ్ ట్రాన్స్‌ఫోర్ట్ అథారిటీ (ఆర్‌టీఏ) కీలక ప్రకటన చేసింది. యూఏఈ గోల్డెన్ వీసా కలిగినవారు డ్రైవింగ్ క్లాసులు లేకుండానే నేరుగా దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చని పేర్కొంది. దీనికోసం స్వదేశంలో అమోదించబడిన మునుపటి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో నాలెడ్జ్, రోడ్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధిస్తే ఆర్‌టీఏ కొత్త డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తుంది. గోల్డెన్ వీసాదారులు దుబాయ్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆర్‌టీఏ వెబ్‌సైట్ ప్రకారం కింది ధృవ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 1. ఒరిజినల్ ఎమిరేట్స్ ఐటీ 2. మునుపటి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కాపీ. 3. నాలెడ్జ్ టెస్ట్ మరియు రోడ్ టెస్ట్ ఫలితాలు.














