Namaste NRI

బ్రిటన్ లో అరుదైన ఘటన

బ్రిటన్‌లో అరుదైన ఘటన జరిగింది. లండన్‌కు చెందిన 29 ఏండ్ల వ్యాపార వేత్త మహమ్మద్‌ మాలిక్‌ తనకు కాబోయే జీవిత భాగస్వామి కోసం బర్మింగ్‌ హోమ్‌ నగరంతో పాటు మాంచెస్టర్‌లో అడ్వర్టైజింగ్‌ హోర్డింగ్‌లపై జనవరి 1న వాణిజ్య ప్రకటనలు ఇచ్చాడు. పెద్దలు కుదిర్చిన పెండ్లి నుంచి నన్ను కాపాడండి అని అందులో పేర్కొన్నారు. నవ్వుతున్న అతడి ఫొటోతో ఉన్న ఈ యాడ్‌లో  FindMalikAWife.com  అనే వెబ్‌సైట్‌ కూడా ఉన్నది.

                        లండన్‌కు చెందిన మాలిక్‌, బర్మింగ్‌హామ్‌ను తన రెండవ నివాసంగా భావిస్తున్నాడు. అయితే పెద్దలు కుదిర్చిన వివాహాలకు తాను వ్యతిరేకం కాదన్నాడు. ముందుగా జీవిత భాగస్వామిని స్వయంగా కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు సరైన అమ్మాయి తనకు తారసపడలేదని అందుకే ఇలా హోర్డింగ్‌లపై ప్రకటనలు ఇచ్చినట్లు తన వెబ్‌సైట్‌లో పేర్కొన్నాడు. మరోవైపు తనకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో అన్నది కూడా మాలిక్‌ వెల్లడిరచారు. నా ఆదర్శ భాగస్వామి 20 ఏండ్ల వయస్సులో ఉన్న ముస్లిం యువతి అయ్యి ఉండాలి. డిగ్రీ చదువుతూ ఉండాలి అని తెలిపారు. పాకిస్థాన్‌లోని పంజాబీ కుటుంబానికి చెందిన తనకు జాతి పట్టింపు లేదని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events