Namaste NRI

హాంగ్ కాంగ్ కీలక నిర్ణయం.. భారత్ తో పాటు మరో ఏడు దేశాలపై

కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను భయాందోళనలకు గురిచేస్తోంది. అమెరికాలో ఒక్కరోజులేనే సుమారు 10 లక్షలకు పైగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా హాంగ్‌ కాంగ్‌లో కూడా ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో దాదాపు 8 దేశాల విమానాలపై హాంగ్‌ కాంగ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఎనిమిది దేశాల విమానాలపై నిషేధం విధించింది. ఈ జాబితాలో యూకే, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, ఫిలిప్పీన్స్‌, ఫ్రాన్స్‌ సహా ఇండియా కూడా ఉంది.  అంతేకాకుండా ఆ దేశ ప్రజలకు కూడా హాంగ్‌ కాంగ్‌ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. శుక్రవారం నుంచి సాయంత్రం  6 తర్వాత ఇండోర్‌ డైనింగ్‌పై నిషేధం అమల్లోకి వస్తుందని చెప్పింది. స్విమ్మింగ్‌ పూల్స్‌, స్పోర్ట్స్‌ సెంటర్లు, బార్లు, క్లబ్బులు, మ్యూజియంలు మూతపడతాయని వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events