Skip to main content

Namaste NRI

అతిథి దేవోభవ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా పొలిమేర నాగేశ్వర్‌ తెరకెక్కించిన చిత్రం అతిథి దేవో భవ. రాజాబాబు మిర్యాల, అశోక్‌ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మించారు. నువేక్ష కథానాయిక. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో రాజశేఖర్‌ మాట్లాడుతూ ఆది చిత్రం కోసం ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. పాటలు వింటుంటే సినిమా బాగుంటుందని అర్థమవుతోంది. ఈ చిత్రంతో ఆదికి పెద్ద సక్సెస్‌ రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా అన్నారు. మొన్నే ఈ చిత్రం చూశా. అందమైన ప్రేమకథతో రూపొందింది. మంచి వినోదం ఉంది.  సినిమా ఏ ఒక్కరినీ నిరాశ పరచదు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది అన్నారు. నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి మాట్లాడుతూ మా కుటుంబ సభ్యులు ప్రజలు మెచ్చే మంచి సినిమాలే తీస్తారు. ఈ మధ్యే ఈ సినిమా చూశా. వినోదంతో పాటు హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అన్నారు. ట్రైలర్‌ చూసిన తర్వాత సినిమా విజయం తథ్యమనే భావన కలిగిందని యువహీరో కార్తికేయ చెప్పారు.

Social Share Spread Message

Latest News