Namaste NRI

ప్రపంచ వ్యాప్తంగా ఒకే రోజు.. 25 లక్షల మందికి

 ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 25 లక్షల మంది కరోనా బారిన పడ్డారు.  దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 30 కోట్లు దాటింది. అత్యధికంగా మళ్లీ అమెరికాలోనే 7,51,512 కేసులు రికార్డయ్యాయి. 2,143 మంది చనిపోయారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 5,95,64,116కు చేరుకుంది. మృతుల సంఖ్య 8,55,843 నమోదైంది. యూకేలో 24 గంటల్లో 1,79,756 కేసులు నమోదయ్యాయి. 231 మది చనిపోయారు. ఇప్పటి వరకు 1.40 కోట్ల మంది కరోనా బారినపడ్డారు. 1.49 లక్షల మంది చనిపోయారు.

                         అర్జెంటీనాలోనూ రోజువారి కేసుల సంఖ్య 1 లక్ష మార్క్‌ దాటింది. ఇక్కడ 1,09,608 కేసులు నమోదయ్యాయి. 40 మంది చనిపోయారు. ఇప్పటి వరకు ఇక్కడ 60 లక్షల మంది కరోనా బారినపడగా 1.17 లక్షల మంది చనిపోయారు. ఫ్రాన్స్‌లో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. గడిచిన 24 గంటల్లో 2,61,481 మంది కరోనా బారినపడ్డారు. 204 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు ఫ్రాన్స్‌ లో 1.11 కోట్ల మంది కరోనా బారినపడగా 1.25 లక్షల మంది చనిపోయారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events