Skip to main content

Namaste NRI

మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీకి మరో షాక్

మయన్మార్‌ లోని సైనిక ప్రభుత్వ కోర్టు ఆంగ్‌ సాన్‌ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. అక్రమ రీతిలో వాకీటాకీలు కలిగి ఉన్న కేసులో ఆమెకు ఈ శిక్షను వేశారు. కొన్నాళ్ల క్రితం ఆమెను అక్కడి సైన్యాధ్యక్షుడు పదవి నుంచి తొలగించి సైనిక పాలనను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమె గృహనిర్బంధంలో ఉన్నారు. తాజాగా ఆమెపై ఉన్న కేసులను విచారించిన కోర్టు ఈ జైలు శిక్షను విధించింది. వాకీటాకీని అక్రమ పద్ధతిలో దిగుమతి చేసుకున్నారనే కేసు, కరోనా నిబంధనలను ఉల్లంఘించారనే కేసులు ఆమెపై మోపడం జరిగింది. ఈ రెండు కేసుల్లోనే ఆమెకు ఇప్పుడు శిక్ష విధించారు.

                        మరోవైపు సూకీని అధికారం నుంచి తప్పించి నిర్బంధించిన వెంటనే ఆ దేశంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. 76 ఏళ్ల సూకీకి మద్దతుగా సైన్యానికి వ్యతిరేకంగా ఆమె మద్దతుదారులు ఆందోళనకు దిగారు.  ఈ ఆందోళనలను సైనిక ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 1,400కు పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు విచారణ సమయంలో మీడియాను అనుమతించలేదు. సూకీ లాయర్లను కూడా మీడియాకు దూరంగా  ఉంచారు. ఇటీవల ఓ కేసులో రెండేళ్ల పాటు సూకీకి శిక్ష పడిరది. దీంతో మొత్తం జైలు శిక్ష కాలం ఆరేళ్లకు చేరింది.

Social Share Spread Message

Latest News