Skip to main content

Namaste NRI

చరిత్ర సృష్టించిన మోడల్ కైలీ జెన్నర్

సామాజిక మాధ్యమ వేదిక ఇన్స్టాగ్రామ్లో అమెరికా మోడల్ కైలీ జెన్నర్ సరికొత్త  చరిత్ర సృష్టించింది. కైలీ కాస్మటిక్స్ వ్యవస్థాపకురాలైన ఆమె.. ఫోటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్స్టాలో దూసుకెళ్తోంది. ఆమెను ఫాలో అవుతున్న వారి సంఖ్య 30 కోట్లు దాటింది. దీంతో ప్రపంచంలోనే ఇంతమంది ఇన్స్టా ఫాలోవర్లు ఉన్న తొలి మహిళగా అరుదైన ఘనత సాధించింది.  ఇన్స్టాలో అత్యధిక మంది ఫాలో అవుతోంది పోర్చుగల్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రోనాల్డ్. అతన్ని 38.8 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. అతని తర్వాత ఇప్పుడు 24 ఏళ్ల కైలీ జెన్నర్ రెండవ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు ఇన్స్టాగ్రామ్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన మహిళగా  పాప్ సింగర్ అరియానా గ్రాండె ఉండగా.. ఆమెను అధిగమించి కైలీ ఈ రికార్డు దక్కించుకుంది. అరియానాను ఇన్స్టాలో 28.9 కోట్ల మంది అనుసరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా నుంచి  కైలీ ఇన్స్టాలో యాక్టివ్గా లేనప్పటికీ ఆమెను అనుసరిస్తున్న వారి సంఖ్య పెరగడం విశేషం.
Social Share Spread Message

Latest News