Skip to main content

Namaste NRI

అమెరికాను లెక్కచేయని ఉత్తర కొరియా

ఉత్తర కొరియా మరింత మొండిగా వ్యవహరిస్తోంది. నెల రోజుల వ్యవధిలోనే మూడో పరీక్ష నిర్వహించింది. అమెరికా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ  ఉత్తర కొరియా మరో  క్షిపణి ప్రయోగాన్ని చేపట్టింది. ఈసారి రైలు నుంచి బాలిస్టిక్‌ మిసైల్‌ను పరీక్షించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. అమెరికా ఆంక్షలను తాము బెదిరేదిలేదనే సందేశాన్నిచ్చేందుకే నెల రోజు వ్యవధిలోనే ఉత్తర కొరియా మూడో ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది. అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తున్నందుకు అగ్రరాజ్యం ఇటీవల కొత్త ఆంక్షలు విధించిన నేపథ్యంలో తాము ఎవరికీ బెదరమనే సంతేకాన్ని ఇచ్చేందుకు కిమ్‌ ఈ పరీక్ష చేపట్టినట్లు నిపుణులు చెబుతున్నారు. ఉత్తర కొరియా రెండు క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించినట్లు దక్షిణ కొరియా తెలిపిన మరుసటి రోజే ఈ ప్రకటన విడుదల చేసింది. ఉత్తర కొరియా వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక సాయం అందిస్తున్న ఐదు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ దేశంపై కొత్త ఆంక్షలు అమలు చేయాలని ఐక్యరాజ్యసమితిని కూడా కోరుతామని చెప్పింది.

Social Share Spread Message

Latest News