చిరంజీవి, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన ఆచార్య చిత్రాన్ని ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 1న ప్రపంవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇదివరకు ఈ సినిమాని ఫిబ్రవరి 4న విడుదల చేయాలనుకున్న విషయం తెలిసిందే. అయితే కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి వాయిదా వేస్తూ, ఏప్రిల్ 1గా కొత్త విడుదల తేదీని ఖరారు చేశారు. సినిమా వాయిదా పడటం మెగా ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే అంశమే. అయితే ఈ నిరీక్షణకు తగ్గ ఫలితం ఉంటుందని గ్యారంటీగా చెప్పగలం అన్నారు నిరంజన్ రెడ్డి. చిరుకి జోడిగా కాలజ్, రామ్‌చరణ్‌కి జోడిగా పూజాహెగ్డే నటించారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు.కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సమర్పిస్తోంది. కొరాటల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి, సంయుక్తంగా నిర్మిస్తున్నారు.














