Skip to main content

Namaste NRI

రూ.4.14 కోట్లు పలికిన విస్కీ బాటిల్!

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌ ఎయిర్‌పోర్టులో ఉన్న డ్యూటీ ఫ్రీ లిక్కర్‌ షాపులో జపాన్‌కి చెందిన లిక్కర్‌ తయారీ సంస్థ సుంటోరీ తయారు చేసిన ది యమజాకీ 55 ఇయర్స్‌ ఓల్డ్‌ విస్కీని వేలం పాటలో పెట్టారు. మొత్తం ఎనిమిది మంది ఈ అరుదైన విస్కీని సొంతం చేసుకునేందుకు పోటీ పడగా చివరకు చైనాకు చెందిన ఓ ప్రయాణికుడు రికార్డు స్థాయిలో 4,88,000 పౌండ్లు ఇండియన్‌ కరెన్సీలో రూ.4.14 కోట్లు చెల్లించి ఈ విస్కీని దక్కించుకున్నాడు. సుంటోరీ వ్యవస్థాపకు షింజిరో టోర్రి ఈ ది యమజాకీ విస్కీని ప్రత్యేకంగా  రూపొందించాడు. 1960లో ముడు అరుదైన రకాల చెందిన సింగిల్‌ మాల్ట్‌ విస్కీలను బ్లెండ్‌ చేసి యమజాకీ స్కాచ్‌ని తయారు చేశారని ఆ కంపెనీ చీఫ్‌ బ్లెండర్‌ షింజిరో ఫికియో తెలిపారు. ఇదొక అందమైన గ్రీకు శిల్పం వంటిదన్నారు. సుంటోరీ సంస్థ అరుదైన రకానికి చెందిన విస్కీని తయారు చేసి లిమిటెడ్‌ గా మార్కెట్‌లోకి తెలుస్తుంది. ప్రత్యేకమైన వ్యక్తులకే వాటిని సరఫరా చేస్తూ ఉంటుంది. 2020లో కేవలం వంద విస్కీ బాటిల్స్‌ని మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది.

Social Share Spread Message

Latest News