Skip to main content

Namaste NRI

పాకిస్థాన్ పై విరుచుకుపడ్డ భారత్

ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌పై భారత్‌ విరుచుకుపడిరది. ఐరాసలో ఇస్లామాబాద్‌ రాయబారి మునీర్‌ అక్రమ్‌ జమ్మూ కాశ్మీర్‌ సమస్యను లేవనెత్తిన తర్వాత భారతదేశం పాకిస్థాన్‌ను గట్టిగా తిప్పికొట్టింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సాయుధ ఘర్షణల నుంచి పౌరులను రక్షించాలి అనే అంశంపై భారత శాశ్వత ప్రతినిధి ఆర్‌.మధుసూదన్‌ ప్రసంగించారు.  ప్రపంచంలోని చాలా ఉగ్రవాద దాడులకు మూలం, లేదా ఏదో ఒక రూపంలో పాకిస్థాన్‌కు సంబంధం ఉంటుందని అన్నారు.  ఉగ్రవాదులకు సహకరించడంలో దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన పాకిస్థాన్‌ ముష్కర మూకలకు ఆశ్రయం కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  26/11 ముంబైపై ఉగ్రవాదులకు పాల్పడిన వారికి పాకిస్థాన్‌ రాజభోగాలు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

                        దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాదం యొక్క శాపాన్ని చవిచూసిన భారతదేశం, ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలలో ఎల్లప్పుడు మూందంజలో ఉందని భారత శాశ్వాత రాయబారి తిరుమూర్తి తెలిపారు. సెక్రటరీ జనరల్‌ నివేదిక ప్రకారం పట్టణ ప్రాంతాలలో 50 మిలియన్లకు పైగా ప్రజలు సంఘర్షణతో ప్రభావితమయ్యారని, అప్ఘనిస్తాన్‌, లిబియా, సిరియా, యెమెన్‌లోని ప్రజలు అంతర్గత సంఘర్షణల వల్ల కలిగే వినాశనాన్ని చూశారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా  ఉగ్రవాద పోరు మళ్లీ పెరిగిందన్నారు. సంఘర్షణానంతరం ఆయా ప్రాంతాల్లో సామాజిక ఆర్థిక పునరుద్ధరణ, శాంతిని పెంపొందించడం, పౌరులకు మౌలిక సదుపాయాల కల్పన పునరావసం కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.

Social Share Spread Message

Latest News