Skip to main content

Namaste NRI

అమెరికాకు చైనా హెచ్చరిక!

బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ సమీపిస్తున్న క్రమంలో చైనా తాజాగా మరోసారి అమెరికాపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విశ్వక్రీడల విషయంలో జోక్యం చేసుకోవడాన్ని మానుకోవాలని హెచ్చరించింది. యూరప్‌తో రష్యాతో నెలకొన్న భద్రతా ఆందోళనలను తీవ్రంగా పరిగణించాలని సూచించింది. చైనా, అమెరికా విదేశాంగ మంత్రులు వాంగ్‌ యీ, ఆంటోని బ్లింకెన్‌ల తాజా టెలిఫోన్‌ సంభాషణపై డ్రాగన్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.  బీజింగ్‌లో ఫిబ్రవరి 4 నుంచి వింటర్‌ ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించాలని చైనా పట్టుదలతో ఉంది. అయితే షింజియాంగ్‌ ప్రావిన్స్‌ తదితర చోట్ల మానవ హక్కుల ఉల్లంఘనను నిరసిస్తూ అమెరికా ఈ వింటర్‌ ఒలింపిక్స్‌ దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. వాంగ్‌ యీ మాట్లాడుతూ బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌లో అమెరికా తన జోక్యాన్ని మానుకోవడమే అత్యంత ముఖ్యమైన విషయమని తెలిపారు. తైవాన్‌ సమస్యపై నిప్పుతో చెలగాటమాడటాన్ని ఆపేయాలని స్పష్టం చేశారు.

Social Share Spread Message

Latest News