Namaste NRI

తెలుగు ప్రవాసీ రాజ శ్రీనివాసరావుకు ఘన సన్మానం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో కరోనా వేళ తోటి ప్రవాసీయులను ఆదుకున్న కొంత మంది ప్రవాసీలను గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారత రాయబార కార్యాలయం సత్కరించింది. తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌కు చెందిన రాజ శ్రీనివాసరావును అబుదాబిలో భారత రాయబారి సంజయ్‌ సుధీర్‌ సన్మానించారు. ఆద్నాక్‌ చమురు ఉత్పాదాక సంస్థలో ఇంజనీర్‌గా పని చేస్తున్న రాజ శ్రీనివాసరావు అబుదాబిలో తెలుగు ప్రవాసీయుల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. భారతీయ క్లబ్‌ తరపున చేసిన సేవలకు గాను బిర్లా ఫౌండేషన్‌ కూడా గతంలో సత్కరించింది. యూఏఈలో ఉన్న 34 లక్షల మంది ప్రవాసీయుల భద్రత, సంక్షేమం భారత ప్రభుత్వ కర్తవ్యమని సంజయ్‌ సుధీర్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events