Namaste NRI

తాను చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం అసత్యం

నాగ చైతన్య, సమంత విడాకుల విషయంలో తాను మాట్లాడినట్లు వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ప్రముఖ కథానాయకుడు అక్కినేని నాగార్జున స్పష్టం చేశారు. సమంతనే ముందుగా నాగా చైతన్యను విడాకులు కోరిందని తాను చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం అసత్యమని నాగార్జున స్పష్టం చేశారు. పెళ్లితో ఒక్కటైన నాగచైతన్య, సమంత ఇటీవలే విడిపోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. నాగార్జున ఒక ఇంటర్వ్యూలో సమంత విడాకులు కోరిందని వ్యాఖ్యానించినట్లు సోషల్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మాధ్యమాలో వార్తలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో నాగార్జున ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. నాగా చైతన్య, సమంత విడాకుల గురించి నేనేమీ మాట్లాడలేదు. వాళ్ల విడాకుల విషయంలో నేను చెప్పినట్లు వస్తున్న వార్తలన్నీ పుకార్లే. దయచేసి  ఇలాంటి వదంతులను వార్తలుగా ప్రసారం చేయవద్దని కోరుతున్నాను అని నాగార్జున కోరారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events