Namaste NRI

హాంగ్ కాంగ్ గూడ్ న్యూస్

హాంగ్‌ కాంగ్‌కు వచ్చే ప్రయాణికులు ఇకపై 21 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని తెలిపింది. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభణతో హాంగ్‌ కాంగ్‌ కూడా కట్టుదిట్టమైన నిబంధనలను రూపొందించి అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే హాంగ్‌ కాంగ్‌కు వెళ్లే ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ప్రయాణికులు హాంగ్‌కాంగ్‌కు చేరుకున్న తర్వాత మూడు వారాలు అంటే 21 రోజుల పాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిందేని అని తేల్చి చెప్పింది.  ఈ నిబంధనను హాంగ్‌ కాంగ్‌ తాజాగా సవరించింది. ప్రయాణికులు స్థానికంగా ఉన్న హోటళ్లలో 14 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉంటే సరిపోతుందని వెల్లడిరచింది. క్వారెంటైన్‌ పూర్తైన తర్వాత మరో 7 రోజుల పాటు స్వీయ పర్యవేక్షణలో ఉండాలని వెల్లడిరచింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 5 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events