Skip to main content

Namaste NRI

రాధేశ్యామ్ వచ్చేస్తుంది… ఎప్పుడంటే ?

కరోనా థర్డ్‌వేవ్‌ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో పెద్ద సినిమాలు ఒక్కొక్కటిగా తమ విడుదల తేదీలను ప్రకటిస్తున్నాయి. తాజాగా రాధేశ్యామ్‌ చిత్రబృందం విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రభాస్‌ హీరోగా నటించిన రాధేశ్యామ్‌ చిత్రాన్ని  మార్చి 11న  ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. రెబల్‌ స్టార్‌ కృష్ణం రాజు ఇందులో కీలక పాత్ర పోషించనున్నాడు. ప్రేమకీ, విధికీ మధ్య జరిగే సంఘర్షణ నేపథ్యంలో రూపొందిన ప్రేమకథా చిత్రమిది. ప్రభాస్‌కి జోడీగా పూజాహెగ్డే నటిస్తుంది. ఈ చిత్రంలో హస్త సాముద్రికా నిపుణుడిగా ప్రభాస్‌ కనిపించనున్నాడు.  రాధా కృష్ణ కుమార్‌ దర్శకత్వం వహించారు. యు.వి.క్రియేషన్స్‌, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తెలుగు, హిందీతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో చిత్రం విడుదలవుతోంది. ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌: రవీందర్‌, సంగీతం: జస్టిన్‌ ప్రభాకరన్‌, మిథున్‌, అనూ మాలిక్‌, మనన్‌ భరద్వాజ, ఛాయాగ్రహణం: మనోజ్‌ పరమహంస.

Social Share Spread Message

Latest News