Skip to main content

Namaste NRI

సకల గుణాభి రామ ట్రైలర్ లాంఛ్

సన్నీ, శ్రీ తేజ్‌, ఆషిమా నర్వాల్‌, తరుణీ సింగ్‌ నటీనటులుగా వెలిగొండ శ్రీనివాస్‌ దర్శకత్వంలో సంజీవరెడ్డి నిర్మిస్తున్న చిత్రం సకల గుణాభి రామ. ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో దర్శకుడు అనిల్‌ రావిపూడి, హీరో విశ్వక్‌ సేన్‌ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ ట్రైలర్‌ చాలా బాగుంది. రైటర్‌గా బిజీగా వెలిగొండ శ్రీనివాస్‌ ఈ సినిమాతో డైరెక్టర్‌గా కూడా బిజీ కావాలని కోరుకుంటున్నాను అని అన్నారు.  చిత్ర దర్శకుడు వెలిగొండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ మంచి కథతో రూపొందిన చిత్రమిది. అనుదీప్‌ చక్కని పాటలు అందించారు అని అన్నారు. హీరో వి.జె సన్నీ మాట్లాడుతూ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. అనుదీప్‌ నాలుగు మంచి సాంగ్స్‌ ఇచ్చాడు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత వివేక్‌, కమేడియన్‌ శివారెడ్డి, హీరోయిన్లు ఆషిమా, తరుణి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనుదీప్‌, నటుడు వరుణ్‌ సందేశ్‌, రఘురాం, సింహాచలం, శ్రీ తేజ్‌, మానస్‌ తదితరులు పాల్గొన్నారు.  చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

…………….

Social Share Spread Message

Latest News