Skip to main content

Namaste NRI

ఖిలాడీ నుంచి క్యాచ్ మీ అంటూ ఇరగదీసిన డింపుల్

రవితేజ, దర్శకుడు రామేష్‌ వర్మ కాంబోలో రాబోతున్న ఖిలాడీ సినిమాను సత్య నారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్‌ దేవీశ్రీ ప్రసాద్‌ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన నాలుగు పాటలు నెట్టింట్లో వైరల్‌ అయ్యాయి. ఐదో పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. క్యాచ్‌ మీ అంటూ సాగే ఈ పాటను రవితేజ, డింపుల్ హయాతిల మీద చిత్రీకరణించారు. ఈ పాటలో డిరపుల్‌ లుక్స్‌, ఎక్స్‌ప్రెషన్స్‌ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఈ పాటతో గ్లామర్‌ విందు ఇచ్చింది డిరపుల్‌, శ్రీమణి సాహిత్యం, నేహా బాషిన్‌,  జస్ప్రిత్‌ జాస్ట్‌ గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

               బాలీవుడ్‌ ప్రొడక్షన్‌ కంపెనీ పెన్‌ స్టూడియోస్‌, ఏ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హవీష్‌ ప్రొడక్షన్‌పై తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్‌గా రవితేజ సరసన నటించారు. ఇందులో రవితేజ రెండు భిన్న పాత్రలను పోషించారు. ఈ చిత్రం నెల 11న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అర్జున్‌, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కూర్పు: అమర్‌ రెడ్డి, ఛాయాగ్రహణం: సుజిత్‌ వాసుదేవ్‌, జీకే విష్ణు.

Social Share Spread Message

Latest News