పాన్ ఇండియా లెవల్లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ బంగారం నేపథ్యంలో వచ్చిన కేజీఎఫ్ మూవీలో బ్యూటీ శ్రీనిధి శెట్టి నటించింది. అందాల పోటీల్లో యువరాణిగా వెలిగి పోయిన ఈ బ్యూటీ మోడలింగ్ నుంచి నేరుగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఆరంభమే కన్నడ రాకింగ్ స్టార్ యశ్ సరసన కేజీఎఫ్ లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా హిట్లో నటించింది. ఈ సినిమా తర్వాత శ్రీనిధి కెరీర్ స్కై ఈజ్ లిమిట్ అన్న చందంగా సాగుతుందుందని అంతా భావించారు కానీ దురదృష్ట నాయికగానే మిగిలిపోయింది. కేజీఎఫ్ తర్వాత సీక్వెల్ కేజీఎఫ్ 2లోనూ నటిస్తోంది. కానీ ఏం ఉపయోగం? ఆ తర్వాత భారీ ఆఫర్లు ఏవీ క్యూ కట్టనే లేదు.














