Skip to main content

Namaste NRI

రానున్న రోజుల్లో మరిన్ని బలగాలు : అమెరికా

ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో లక్ష మంది రష్యా సైనికులు మోహరించిన నేపథ్యంలో తమ మిత్రపక్షాలకు సంఫీుభావంగా పోలండ్‌, రొమేనియా, జర్మనీలకు అదనపు బలగాలను తరలించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయించారు. అమెరికాకు చెందిన అగ్రశ్రేణి ఎయిర్‌బార్న్‌ ఇన్‌ఫ్యాంట్రీ దళాలు పోలండ్‌లో ఉక్రెయిన్‌ సరిహద్దులకు చేరువలో మోహరించాయి. మొత్తం 1700 మంది సైనికులు అక్కడ దిగుతారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు పాల్పడే అవకాశం ఉందన్న వార్తల నడుమ ఈ పరిణామం చోటు చేసుకుంది. రానున్న రోజుల్లో మరిన్ని బలగాలు రానున్నాయి.

Social Share Spread Message

Latest News