Skip to main content

Namaste NRI

ఖతార్‌లో భారత రాయబారిగా తెలుగు వ్యక్తి శ్రీకర్‌ రెడ్డి నియామకం

ఖతార్‌లో భారత రాయబారిగా తెలుగు వ్యక్తి, సీనియర్ దౌత్యవేత్త కొప్పుల శ్రీకర్‌ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన నియామకంపై భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. భువనగిరి జిల్లాకు చెందిన ఈయన కాకతీయ మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు. 2001 బ్యాచ్‌ ఐఎ్‌ఫఎస్‌ అధికారి అయిన శ్రీకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి మొదలుకొని ఐక్యరాజ్య సమితి వరకు వివిధ హోదాలలో పని చేశారు. ప్రస్తుతం అమెరికాలోని శాన్‌ఫ్రాన్సి్‌సకోలో కాన్సుల్‌ జనరల్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఖతార్ లో భారత రాయబారి గా వున్న విపుల్ స్థానంలో శ్రీకర్‌రెడ్డి భాద్యతలు స్వీకరించనున్నారు. శ్రీకర్‌రెడ్డి నియామకంపై ఖతార్‌లోని ప్రవాసీ తెలుగు సమాజం సంతోషం వ్యక్తం చేసింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events