Skip to main content

Namaste NRI

అగధ విషయంలో మళ్లీ ఆ చరిత్ర రిపీట్‌ కానుంది : కాశీ విశాలాక్షి

దర్శక, నిర్మాత ఎంఎస్‌ రాజు రూపొందించిన డివైన్‌ మిస్టిక్‌ థ్రిల్లర్‌ అగధ. కాశీ విశాలాక్షి బలుసు నిర్మించారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్‌రెడ్డి ప్రధానపాత్రధారులు. ఈ సందర్భంగా తెలంగాణలోని చారిత్రక, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం బల్కంపేట ఎల్లమ్మ-పోచమ్మ దేవాలయంలో అమ్మవార్ల దివ్య ఆశీస్సులతో ఈ చిత్ర ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కొంతమేర అమ్మవారిపై ఆధారపడ్డ కథ ఇది. అనుకోకుండా బల్కంపేట అమ్మవార్ల ఆశీస్సులతో ప్రచారం మొదలవ్వడం ఆనందంగా ఉంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించాం. గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. త్వరలోనే ట్రైలర్‌ రానుంది అని ఎంఎస్‌రాజు తెలిపారు.

ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రాలేదు. ఈ తరహా కథలకు ఇదో ట్రెండ్‌ సెట్టర్‌ అవుతుంది. ఎంఎస్‌రాజు నిర్మించిన దేవి సంచలన విజయం సాధించింది. అగధ విషయంలో మళ్లీ ఆ చరిత్ర రిపీట్‌ కానుంది అని నిర్మాత కాశీ విశాలాక్షి బలుసు నమ్మకం వెలిబుచ్చారు. కథానాయిక కామాక్షి భాస్కర్ల ప్రత్యేకంగా అలంకరించుకొని భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలు సమర్పించారు. చిత్ర సమర్పకులు అజయ్‌ కేఆర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ఎన్వీఎన్‌లతోపాటు నటులు సుబ్బరాజు, హీరో శ్రవణ్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆగస్ట్‌ 14న సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News