Skip to main content

Namaste NRI

ప్రేక్షకుల్ని వందశాతం మెప్పించే సినిమా ఇది : జయకృష్ణ

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు, జయకృష్ణ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రం శ్రీనివాసమంగాపురం. రషా తడానీ కథానాయిక. ప్రతిష్టాత్మక వైజయంతీ మూవీస్‌ సమర్పణలో పి.కిరణ్‌ నిర్మించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో హీరో జయకృష్ణ మాట్లాడారు. ప్రేక్షకుల్ని వందశాతం మెప్పించే సినిమా ఇది. ఇందులోని ప్రతి పాత్రనూ రియలిస్టిక్‌గా రాశారు దర్శకుడు అజయ్‌భూపతి. ఓ మంచి కథ ద్వారా పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది అని జయకృష్ణ అనందం వెలిబుచ్చారు.

తెలుగులో ఈ తరహా మేకింగ్‌ సినిమాలు రావడం అరుదు అని, మహేశ్‌బాబులా జయకృష్ణ కూడా పెద్ద స్టార్‌ అవుతారని, మోహన్‌బాబు, నరేశ్‌ పోషించిన పాత్రలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు అజయ్‌ భూపతి నమ్మకంగా చెప్పారు. ఇంకా నరేశ్‌, బ్రహ్మాజీ, శ్రీనివాస్‌ వడ్లమాని, డీవోపీ జైకృష్ణ కూడా మాట్లాడారు. ఈ చిత్రం ఈనెల 30న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News