మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎన్నారైలను భాగస్వామ్యం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. మన ఊరు మన బడి విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. తాజాగా దీనికి సంబంధించి విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మన ఊరు మన బడి కార్యక్రమంలో ప్రవాస తెలంగాణవాసులను భాగస్వామ్యం చేసేందుకు ఈ నెల 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐ సంఘాలతో జూమ్ ఆన్‌లైన్ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్, సబితాఇంద్ర రెడ్డి పాల్గొనున్నారని ఎన్‌ఆర్‌ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన పథకం. పెద్ద ఫ్లాగ్ షిప్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులోకి రానున్నాయని వెల్లడిరచారు.
ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా డిజిటల్ విద్య, ఆధునీకీకరించిన టాయిలెట్లు, వంద శాతం విద్యుదీకరణ, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఫర్నిర్, కొత్త తరగతి గదులు, సురక్షితమైన తాగునీటి సరఫరా, కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు, మెరుగైన వంటశాలలు, డైనింగ్ హాళ్లతో సహా 12 రకాల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. రూ.10 లక్షలు దానం చేసిన దాతలకు వారి సూచించిన వారి పేరును స్కూల్‌కు నామకరణం చేస్తారని తెలిపారు. ప్రవాస తెలంగాణ వాసులు ముందుకు వచ్చి భాగస్వామ్యం కావాలని మహేష్ బిగాల పిలుపునిచ్చారు.














