Skip to main content

Namaste NRI

ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి…రష్యా బలగాలు వెనక్కి

ఉక్రెయిన్‌ సరిహద్దుల నుంచి కొన్ని బలగాలను రష్యా ఉపసంహరించింది.  ఈ విషయాన్ని మాస్కో ప్రతినిధులు వెల్లడిరచారు. ఉక్రెయిన్‌పై దండెత్తేందుకు సిద్ధమైన రష్యా, పశ్చిమ దేశాల దౌత్యంతో వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు. రెండు దేశాల సరిహద్దుల వద్ద లక్షలాది మంది సైనికులను రష్యా మోహరించిన విషయం తెలిసిందే. అయితే కొన్ని దళాలను మాత్రం తమ బేస్‌ క్యాంపులకు పంపిస్తున్నట్లు రష్యా చెప్పింది. దక్షిణ, ఉత్తర సైనిక ప్రాంతాల వద్ద ఉన్న బలగాలు వెనక్కి పంపినట్లు రష్యా అధికారులు వెల్లడిరచారు. డ్రిల్స్‌ పూర్తి చేసుకున్న తర్వాత తమ దళాలు కొన్ని సరిహద్దు నుంచి వెనక్కి మళ్లినట్లు రష్యా రక్షణ మంత్రి తెలిపారు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం సైనిక శిక్షణ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఉద్రికత్తలను తగ్గించడంలో పశ్చిమ దేశాలు సఫలమైనట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. నాటో దళంలో చేరబోమని ఉక్రెయిన్‌ హామీ ఇస్తే ఆ దేశం దాడికి వెళ్లమని రష్యా ఇప్పటికే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News