Skip to main content

Namaste NRI

భీమ్లా నాయక్ విడుదల తేదీ ఖరారు

పవన్‌ కల్యాణ్‌, రానా  ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా భీమ్లా నాయక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.  నిత్యమేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. భీమ్లా నాయక్‌ విడుదల తేదీ ఖరారైంది. ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఈ సినిమాలో రానా విలన్‌గా నటిస్తున్నాడు. పవన్‌ కళ్యాణ్‌ పవర్‌పుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో అభిమానులకు ఫీస్ట్‌ అందించనున్నాడు.  భీమ్లానాయక్‌ ఆలస్యంగా విడుదల కావొచ్చని అనుకున్నారంతా. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ భీమ్లా నాయక్‌ విడుదల తేదీని ప్రకటించారు. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్‌ రచన చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.మలయాళంలో విజయవంతమైన అయ్యప్పనుమ్‌ కోశియమ్‌ కి రీమేక్‌గా  రూపొందిన చిత్రమిది. తమనన సర్వాలు సమకూర్చారు.

Social Share Spread Message

Latest News