Namaste NRI

అంగరంగ వైభవంగా భీమ్లానాయక్.. ప్రీరిలీజ్ వేడుక

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన భీమ్లానాయక్‌ ప్రీ రిలీజ్‌ వేడుక అభిమానుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌, మరో అతిథిగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హాజరయ్యారు. ఈ చిత్రాన్ని  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మించింది. తొలుత పవన్‌ కల్యాణ్‌ నటించిన సినిమాలతో పాటు నృత్యాలతో కార్యక్రమం ప్రారంభమైంది. ఆ తర్వాత చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ ఆధ్వర్యంలో భీమ్లానాయక్‌ పాటల ఆలాపన జరిగింది.  ఈ సినిమాలో పాడిన గాయనీగాయకులను సత్కరించారు. సాహిత్యాన్ని అందించిన రామజోగయ్య శాస్త్రితో పాటు సంగీత కళాకారులు పాల్గొన్నారు.

                చిత్ర దర్శకుడు సాగర్‌ మాట్లాడుతూ నల్గొండ నుండి దర్శకుడిగా కావాలని వచ్చాను. కుటుంబసభ్యుల సహకారంతో వచ్చాను. ఈ రోజు పవన్‌ గారితో పనిచేయడం సంతోషంగా ఉంది. భీమ్లాకు పనిచేసిన రానా, సముద్రఖని నిత్యామీనని, సంయుక్త రవికె.చంద్రన్‌, ఏఎస్‌ ప్రకాష్‌, ఫైట్స్‌ విజయ్‌, గణేష్‌ మాస్టర్‌, నిర్మాత నాగవంశీ, చినబాబు, భీమ్లానాయక్‌ బ్యాక్‌ బోన్‌ త్రివిక్రమ్‌గారు. ఆయన స్క్రీన్‌ప్లే లేకుండా, సంభాషణలు లేకుండా సినిమా లేదన్నారు. పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ సోదరులు మంత్రి కేటీఆర్‌ని ఆప్యాయంగా రామ్‌ భాయ్‌ అని పిలుస్తాను. మేము ఆహ్వానించగానే ఇక్కడికి వచ్చినందుకు చిత్రబృందం తరుపున మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్‌గారి నాయకత్వంలో తెలుగు చిత్రపరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఎంతో తోడ్పాడు లభిస్తున్నది.అందుకు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నాను. చిన్నపాటి అవసరం కలిగినా మాట్లాడి పరిష్కరించే మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు కృతజ్ఞతలు. చిత్ర పరిశ్రమకు రాజకీయాలు ఇమడవు. నిజమైన కళాకారుడికి కులం, మతం ప్రాంత అనే భేదాలు ఉండవు. జనజీవితంలో ఉన్నా సినిమా నాకు అన్నం పెట్టింది. సినిమా లేకుంటే నేను ప్రజాజీవితంలో ఉండే అవకాశం ఉండేది కాదేమో భీమ్లానాయక్‌ మిమ్మిల్ని అలరిస్తుంది అన్నారు.

                 అనంతరం నటుడు రానా మాట్లాడుతూ  ఈ సినిమాతో చాలా మంది మేధావులను కలిశాను. చాలా చిత్రాలు చేశాను. కానీ యాక్టర్‌ అయ్యాను. హీరో అవడం ఎలా అనే దానికోసం చూస్తున్నాను. అప్పుడు వచ్చారు పవన్‌. ఇండియాలో చాలా మంది హీరోలతో చేశాను కానీ పవన్‌ స్పెషల్‌. నేను ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒకతీరులో ఉంటే ఇక ముందు ఇంకో విధంగా ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వ సినీరంగానికి ఎంతో చేస్తోంది. హైదరాబాద్‌ సినీరంగాని గ్లోబల్‌ సిటీ అవుతుంది అన్నారు.  ఈ వేడుకలో పవన్‌ కళ్యాన్‌, రానా కలిసి నటించిన నిత్యామీనన్‌, సంయుక్త కథానాయిక, త్రివిక్రమ్‌, చినబాబు, నిర్మాత నాగవంశీ, దర్శకుడు సాగర్‌ చంద్ర, తమన్‌, సముద్రఖని, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, దానం నాగేందర్‌, మాగంటి గోపీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events