రాజీవ్ సాలూరి, దీప్సిక జంటగా నటించిన చిత్రం ఆఖరి ముద్దు. సీవీ ఆర్ట్స్ పతాకంపై సీవీ రెడ్డి స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ చిత్రీకరణకు సిద్ధమవుతున్నది. దర్శక నిర్మాత సీవీ రెడ్డి మాట్లాడుతూ దాదాపు పది రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో హీరో హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ కథ నన్ను చాలా ప్రభావితం చేసింది. సమాజానికి మార్గదర్శనం కావాలనే ఆశతో ఈ సినిమాను రూపొందిస్తున్నాను అన్నారు. ఎనిమిదేళ్ల విరామం తర్వాత నేను తీస్తున్న సినిమా ఇది. రెండో షెడ్యూల్‌ను మార్చి నెలలో ప్రారంభిస్తాం. నా గత చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది. అఖరి ముద్దు టైటిల్ బాగుందని అందరూ అంటున్నారు. అలాగే సినిమా కూడా అందరినీ అలరిస్తుంది అన్నారు. సీత, కాకరాల, పృథ్వీ, పవిత్ర లోకేష్, పోసాని తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : కోటి, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, ఆర్ట్: మౌళి.














