Skip to main content

Namaste NRI

36 దేశాలకు షాక్ ఇచ్చిన రష్యా

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా తమ దేశంపై ఆంక్షలు విధించిన దేశాలకు ప్రతి ఆంక్షలు విధిస్తున్నది. పాశ్చాత్య దేశాలు తమ విమానాలపై నిషేధం విధించిన నేపథ్యంలో రష్యా కూడా దీటుగా స్పందించింది. జర్మనీ సహా 36 దేశాలకు చెందిన విమానాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ జాబితాలో యుకేబై ఆధారపడే జెర్సీ, బ్రిటీష్‌ విదేశీ భూభాగాలైన జిబ్రాల్టర్‌ ఉన్నాయి. రష్యా విమానయాన సంస్థలు ఇప్పుడు అత్యధిక మెజారిటీ యూరోపియన్‌ దేశాలతో పాటు కెనడా గగనతలంలోకి ప్రవేశించడానికి వీల్లేకుండా మాస్కో ఆంక్షలు ఎదుర్కొంటున్నది. రష్యా ప్రతీకార చర్యలతో విమానయాన సంస్థలు ప్రత్యేక అనుమతితో మాత్రమే రష్యన్‌ గగనతలంలోకి ప్రవేశించగలవు. ఈ చర్యల వల్ల విమానయాన సంస్థలు కొన్ని మార్గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దీనివల్ల టిక్కెట్లు ధరలు పెరుగుతాయి. రష్యా ఎయిర్‌పోర్టుల్లో కార్యక్రలాపాలు, గగనతలాన్ని ఆయా దేశాల విమానాలు వినియోగించుకోవడాన్ని నిషేధించింది. రష్యా విమానాయన అథారిటీ ఈ మేరకు  ఉత్తర్వులు జారీ చేసింది.

Social Share Spread Message

Latest News