Skip to main content

Namaste NRI

రష్యాకు భారీ షాక్‌

ఈ ఏడాది జరగనున్న ఫిఫా ప్రపంచకప్‌ నుంచి రష్యాపై ఫిఫా బహిష్కరణ వేటు వేసింది. ఫిఫా ప్రపంచకప్‌ 2022తో పాటు అన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ పోటీలు, లీగ్‌ల నుంచి బహిష్కరిస్తున్నట్లు ఫిఫా, యూఈఎఫ్‌ఏ సంయుక్త సమావేశంలో వెల్లడిరచాయి.  ఈ ఏడాది చివర్లో ఖతార్‌లో జరిగే ప్రపంచ కప్‌ కోసం రష్యా పురుషుల జట్టు మార్చిలో క్యాలిఫైయింగ్‌ ప్లే ఆఫ్‌లలో పోలాండ్‌తో ఆడాల్సి ఉంది.  పోలాండ్‌ ఫుట్‌బాల్‌ జట్టు ఇదివరకే ప్రపంచకప్‌ క్యాలిఫయర్స్‌లో రష్యాతో ఆడేది లేదని తేల్చి చెప్పింది. అదే విధంగా ఇంగ్లాండ్‌తో జూలైలో జరగనున్న యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో రష్యా మహిళల జట్టు ఆడనుంది. ఫుట్‌బాల్‌ జట్లపై ఫిఫా, యూఈఎఫ్‌ఏ నిషేధం విధించడం రష్యాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.

Social Share Spread Message

Latest News