Skip to main content

Namaste NRI

హను-మాన్‌ లో అంజమ్మ గా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ఫస్ట్‌ లుక్‌

 తేజా సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం హను`మాన్‌. అమృతఅయ్యర్‌ కథానాయిక. ఈ సినిమాలో తమిళ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ అంజమ్మగా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు.  ఓ శక్తిమంతమైన పాత్రని పోషిస్తున్న వరలక్ష్మి శరత్‌కుమార్‌ లుక్‌ని ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్‌ విడుదల చేశారు. నవ వధువుగా వరలక్ష్మి శరత్‌కుమార్‌ లుక్‌లో కనిపిస్తున్న విధానం ఆసక్తిని రేకెత్తించేలా ఉంది. చేతిలో కొబ్బరికాయల గుత్తితో కోపం చూస్తూ కనిపిస్తున్నారామె. ఇండియన్‌ స్క్రీన్‌పై తొలి సూపర్‌హీరో చిత్రమిది. దక్షిణాది భాషలతో పాటు హిందీలో విడుదల చేస్తాం. దుష్టశిక్షకురాలిగా అంజయ్య పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇందులో సాహసోపేతమైన పోరాట ఘట్టాలు ఉంటాయి. విజువల్‌ ఎఫెక్ట్స్‌ని పెద్దపీట వేస్తూ సినిమాని రూపొందిస్తున్నామని,  షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: దాశరథి శివేంద్ర, సంగీతం: అనుదీప్‌, హరిగౌరా, జైక్రిష్‌, కృష్ణసౌరభ్‌, నిర్మాణ సంస్థ : ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్‌,  నిర్మాత: కె.నిరంజన్‌ రెడ్డి, రచన`దర్శకత్వం: ప్రశాంత్‌శర్మ.

Social Share Spread Message

Latest News