వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ముఖచిత్రం. కలర్ ఫొటో మూవీతో హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రంలోని క్లాస్ రూమ్‌లో అనే గీతాన్ని సంగీత దర్శకుడు తమన్ విడుదల చేశారు. ఈ పాటకు కాలభైరవ స్వరాలు సమరకూర్చడంతో పాటు సింధూరి విశాల్‌తో కలిసి ఆలపించారు. రామజోగయ్యశాస్త్రి సాహిత్యమందించారు. పాట చాలా బాగుందన్న థమన్ చిత్రబృందానికి బెస్ట్ విశేష్ తెలిపారు. గంగాధర్ దర్శకుడు. ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల సంయుక్తంగా నిర్మించారు. ఎస్కేఎన్ సమర్పిస్తున్నారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షక్షుల ముందుకు రానుంది.














