Skip to main content

Namaste NRI

పోలాండ్‌కు తరలివెళ్లినా.. మేం పని చేస్తూనే వున్నాం

ఉక్రెయిన్‌లో భారతీయులకు ఇండియన్‌ ఎంబసీ మరో కీలక సూచన చేసింది. రష్యా దాడి నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని భారతీయ కార్యాలయాన్ని కేంద్రం పోలాండ్‌ రాజధాని వార్సాకు తరలించారు.  తమ కార్యాకలాపాలు కొనసాగుతున్నాయని, కావాల్సిన వారు తమను సంప్రదించవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. పోలాండ్‌లో తాము యథావిథిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని పేర్కొంది. తమ ఫోన్‌ నెంబర్లను కూడా షేర్‌ చేసింది. కాగా ఉక్రెయిన్‌లో 50 మంది భారతీయులు ఉన్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరవింద్‌ బాగ్జీ తెలిపారు. వారిలో 15 నుంచి 20 మంది స్వదేశానికి తిరిగొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Social Share Spread Message

Latest News