Namaste NRI

దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ విడుదల చేసిన మణిశంకర్‌ టీజర్‌  

శివ కంఠమనేని, సంజన గల్రానీ, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా మణిశంకర్‌.డబ్బు చుట్టూ తిరిగే కథనాలకు యాక్షన్‌ అంశాలు కలిపి ఈ సినిమా తెరకెక్కింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ విడుదల చేశారు. అనంతరం దర్శకుడు మాట్లాడుతూ టీజర్‌ ఇంప్రెసివ్‌గా ఉంది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఘటనలను ఆధారంగా చేసుకుని జీవీకే ఈ సినిమాను తీసినట్లుగా తెలుస్తోంది అన్నారు. ఈ డబ్బు ప్రతి ఒక్కర్నీ శాసిస్తుంది. ఓడిస్తుంది. ఓడిన ప్రతివాడిని గెలిపిస్తుంది. గెలిచిన ప్రతివాడిని ఓడిస్తుంది అనే డైలాగ్స్‌ టీజర్‌లో ఉన్నాయి. మణిశంకర్‌ మంచి యాక్షన్‌ థ్రిల్లర్‌ అన్నారు జీవీకే.  హీరో శివ కంఠమనేని మాట్లాడుతూ మణిశంకర్‌ అనే గ్యాంగ్‌ స్టర్‌ కథ ఇది. అతను చేసే భారీ డీలింగ్స్‌ ఆసక్తికరంగా ఉంటాయి. కథంతా నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంటుంది అన్నారు. లైట్‌హౌస్‌ సినీ క్రియేషన్స్‌ పతాకంపై కేఎస్‌.శంకర్‌రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్‌ నిర్మించారు. జి. వెంకటకృష్ణన్‌ దర్శకుడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events