Skip to main content

Namaste NRI

ఈసారి చర్చలు విఫలమైతే.. మూడో ప్రపంచ యుద్ధమే

రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరోసారి స్పష్టం చేశారు. ఈసారి శాంతి చర్చలు విఫలమైతే మూడవ ప్రపంచ యుద్దానికి దారితీయొచ్చని హెచ్చరించారు. నేను అతనితో చర్యలకు సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడే కాదు గత రెండేళ్లుగా ఇదే చెబుతున్నాను. ఇప్పుడు యుద్దానికి ముగింపు పలకాలని కోరుకుంటున్నాను అని జెలెన్‌స్కీ తెలిపారు. పుతిన్‌తో ముఖాముఖి భేటీకి ఏ ఫార్మాట్‌లోనైనా సరే తాను సిద్ధమని అన్నారు.  చర్చలు జరుగకుండా ఈ యుద్ధం ముగియదని అన్నారు. అయితే ఈ ప్రయత్నాలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధం తప్పకపోవచ్చని అన్నారు.

Social Share Spread Message

Latest News