అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అల్లు అర్జున్‌కు ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ నిర్మాత అల్లు అరవింద్, టి.సుబ్బిరామిరెడ్డి, భాను ప్రకాష్, ఐఏఎస్, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, హరిష్‌శంకర్, క్రిష్, గుణశేఖర్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. అల్లు అర్జున్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గడ్డం రవికుమార్ గజమాలతో ఈ స్టార్ హీరోను సత్కరించారు.














